మిడతలు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వలస వెళ్లడానికి గల కారణాలేంటి?
- వాటికి ఆహారం లేక, గుడ్లు పొదగడానికి, ఎండ వేడిమి తట్టుకోలేక వర్షానికి, గాలివాటానికి అనుగుణంగా ఇవి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వలస వెళ్తాయి.
మిడతల దండును తగ్గించే సహజ శత్రువులంటూ లేవా?
- మిత్ర పురుగులు, పక్షులు, పురుగులు ఉంటాయి అవి ఈ మిడతలను తింటాయి. లిస్టర్ బిట్టిల్ వంటివి కూడా వీటిి గుడ్లను తినేస్తాయి.
సిద్దిపేటలోని కొన్ని పొలాలను మిడతలు తినేశాయి. అవి ఈ ఎడారి మిడతలు కాదంటున్నారు. మరి అవి ఏంటి?
- వర్షం వస్తే ఇంతకు ముందే గుడ్లు పెట్టిన వేరే రకం మిడతల గుడ్లు పొదగబడి అవి పెరిగి ఇలా పొలాలను తినేశాయి. ఆ మిడతలు ఈ దండు ఒకటి కాదు.
ఈ దండును అడ్డుకోవడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది?
- రైతులను ఏకం చేసి వారికి అవగాహన కల్పించాలి. ఈ మిడతలు రాత్రి వేళ క్రియాశీల రహితంగా ఉంటాయి. ఆ సమయాల్లో వేప రసాయనం పిచికారీ చేయడం, పొగపెట్టడం వంటి కార్యక్రమాలు చేపట్టాలి.
నాగ్పూర్దగ్గర ఆగిపోయాయంటున్నారు? మళ్లీ దక్షిణాదికి వచ్చే అవకాశం ఉందా?
- ప్రస్తుత పరిణామాల్లో ఇప్పుడు నాగ్పూర్ నుంచి దక్షిణాదికి వచ్చే గాలివాటం మరలింది. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఎడారి మిడతల దండు ఇటువైపుకి వచ్చే అవకాశం లేదు.
ఇవీ చూడండి: కేంద్ర విద్యుత్తు చట్టంపై కేసీఆర్ గుస్సా..