సంగారెడ్డి నియోజకవర్గంలోని వ్యాపారస్తులు ముగింపు సమయంలో పోలీసులు సైరన్ మోగిస్తే తప్ప దుకాణాలు మూయడం లేదు. ఉదయం 10 దాటినా వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. లాక్డౌన్ సడలింపు సమయం దాటాక అన్ని దుకాణాలు మూసేయాలని పోలీసులు ఎంతగా చెప్పినప్పటికీ... వ్యాపారులు మాత్రం వినడం లేదు.
కరోనాను కట్టడి చేయాలంటే లాక్డౌన్ నిబంధనలు పాటించాలని పోలీసులు చెబుతున్నారు. కేవలం సడలింపు సమయంలో మాత్రమే అన్ని పనులు చేసుకోవాలని ఉదయం 10 దాటాక ఒక్కరు కూడా బయట కనిపించకూడదని అన్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని... ఒకవేళ వచ్చినా మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలని సూచించారు.
ఇదీ చదవండి : Lockdown Effect: ఆర్థిక సుడిగుండంలో కూరగాయల రైతు