సంగారెడ్డి జిల్లా నాగల్గిద్దా మండలంలోని ఔదత్పూర్లో గత మార్చిలో గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో మద్యం, బెల్ట్ షాపులు నిషేధిస్తూ తీర్మానం చేశారు. కానీ కొంత మంది దొంగచాటున గ్రామానికి ఆటోలో మద్యం తరలిస్తుండగా స్థానికులు అడ్డుకుని సర్పంచ్‌కు సమాచారమిచ్చారు.
విషయం తెలుసుకున్న సర్పంచ్ పోలీసులకు సమచారం అందించారు. వారు విచారణ జరిపి మద్యాన్ని, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం లిక్కర్‌ను ఎక్సైజ్ శాఖకు అప్పగించారు. గ్రామంలో ఎవరైనా మద్యం సరఫరా చేసినా, అమ్మినా జరిమానా విధిస్తామన్నారు.