ETV Bharat / state

వ్యాక్సినేషన్​కు సర్వం సిద్ధం.. ఆస్పత్రిలో టీకాలు భద్రం

సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ వైద్య విధాన పరిషత్ ప్రాంతీయ ఆస్పత్రికి కోవిషీల్డ్ డోసులు చేరుకున్నాయి. 160 మంది వైద్యులు, సిబ్బందికి టీకా ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు అధికారులు తెలిపారు.

koveshild distribution in sangareddy district
ఆస్పత్రికి చేరుకున్న 17 కోవిషీల్డ్ డోసులు
author img

By

Published : Jan 15, 2021, 3:58 PM IST

కరోనా మహమ్మారి పై ముందువరుసలో ఉండి పోరాడే యోధులకు పంపిణీ చేయనున్న టీకా.. ప్రభుత్వ ఆసుపత్రులకు చేరింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ వైద్య విధాన పరిషత్ ప్రాంతీయ ఆస్పత్రికి 160 మంది వైద్యులు, సిబ్బందికి ఇచ్చేందుకు 17 కోవిషీల్డ్ డోసులు సరఫరా చేశారు.

జిల్లా కేంద్రమైన సంగారెడ్డి ఆస్పత్రి నుంచి ప్రత్యేక అంబులెన్స్​లో తీసుకువచ్చిన వ్యాక్సిన్​ని డాక్టర్ బాలరాజు, సునీల్ కుమార్ నాయక్, తాహసీల్దార్ కిరణ్ కుమార్ శీతల గదిలో భద్రపరిచారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం శనివారం ఉదయం 10 గంటలకు టీకా వేయడం ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి: తలుపులు తెరవలేదని ఇల్లు తగలబెట్టిన తాగుబోతు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.