కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించింది. ఇందులో భాగంగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం మాది సమీపంలోని కర్ణాటక సరిహద్దును మూసేసి పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర నుంచి పాలు, కూరగాయలు, ఔషధాలు, నిత్యావసర సరుకుల వాహనాలను మాత్రమే రాష్ట్రంలోకి అనుమతిస్తున్నారు.
నిత్యావసరాలు కాకుండా ఇతర సరుకు రవాణా వాహనాలను సరిహద్దుల్లోనే నిలిపేసి వెనక్కి పంపుతున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ప్రయాణికులను అడ్డుకోవడం వల్ల జాతీయ రహదారిపై వాహనాలు బారులు తీరాయి.
ఇవీ చూడండి: 27కు చేరిన కరోనా కేసులు.. కట్టడికి కఠిన నిర్ణయాలు