ETV Bharat / state

జహీరాబాద్​లో కర్ఫ్యూకు సంపూర్ణ మద్దతు

జహీరాబాద్​లో ప్రజలు కర్ఫ్యూకు పూర్తి సహాకారం అందిస్తున్నారు. వ్యాపార, వాణిజ్య సముదాయాలను స్వచ్ఛందంగా మూసివేయడం వల్ల ప్రధాన రహదారులు బోసిపోతున్నాయి. ప్రభుత్వ ఆదేశాలతో 5 బస్సులను అత్యవసరం కోసం సిద్ధంగా ఉంచినట్లు డీఎం రమేశ్​ పేర్కొన్నారు.

జహీరాబాద్​లో కర్ఫ్యూకు సంపూర్ణ మద్దతు
జహీరాబాద్​లో కర్ఫ్యూకు సంపూర్ణ మద్దతు
author img

By

Published : Mar 22, 2020, 11:36 AM IST

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ వాసులు సంపూర్ణంగా పాటిస్తున్నారు. తెలంగాణ- కర్ణాటక సరిహద్దులోని జహీరాబాద్​లో వ్యాపార, వాణిజ్య సముదాయాలను స్వచ్ఛందంగా మూసివేయడం వల్ల ప్రధాన రహదారులు బోసిపోతున్నాయి. ఆర్టీసీ డిపోల్లో సుమారు వంద బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ప్రభుత్వ ఆదేశాలతో 5 బస్సులను అత్యవసరం కోసం సిద్ధంగా ఉంచినట్లు డీఎం రమేశ్​ తెలిపారు.

జహీరాబాద్​లో కర్ఫ్యూకు సంపూర్ణ మద్దతు

కర్ణాటక, మహారాష్ట్ర నుంచి అంతర్రాష్ట్ర రాకపోకలు సాగించే వాహనాలతో సందడిగా కనిపించే 65వ నెంబరు జాతీయ రహదారి వెలవెల బోతోంది. నిత్యం ట్రాఫిక్ జామ్​లతో రద్దీగా కనిపించే భవాని మందిర్ ట్రాఫిక్ కూడలి జన సంచారం లేక ఖాళీగా కనిపిస్తోంది. జనతా కర్ఫ్యూ నేపథ్యంలో ప్రజలు ఇంటికే పరిమితం కావాలని పోలీసులు వాహనాల్లో గస్తీ నిర్వహిస్తూ ప్రచారం చేస్తున్నారు.

ఇదీ చూడండి: కరోనా ఎఫెక్ట్‌ : బోసిపోయిన పర్యాటక ప్రాంతాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.