సంగారెడ్డి జిల్లాలో 73వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వాడ వాడన త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో జిల్లా పరిషత్ అధ్యక్షురాలు మంజుశ్రీ జెండా ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులు, ప్రభుత్వ కార్యక్రమాలను తన ప్రసంగంలో ప్రజలకు వివరించారు. వివిధ శాఖలు శకటాలు ప్రదర్శించాయి. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ప్రజలను ఆకట్టుకున్నాయి. సమీకృత కలెక్టరేట్లో పాలనాధికారి జెండా ఆవిష్కరించారు. కలెక్టర్ హన్మంతరావుకు, ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డికి జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.
ఇదీ చూడండి :అడ్వాణీకి జ్వరం... స్వాతంత్ర్య వేడుకలకు దూరం