సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్‌లోని రోజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోలార్ యూనిట్ శానిటరీ నాప్కిన్ వెండింగ్ మిషన్‌ను సంస్థ వ్యవస్థాపకులు రాబర్ట్ ఫెల్నర్, ఇవా దంపతులు ప్రారంభించారు. ఇస్నాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యుత్ సరఫరాకు ఖర్చు లేకుండా సోలార్ యూనిట్‌ను జర్మనీ దేశానికి చెందిన రోజ్ ఫౌండేషన్ ఏర్పాటు చేసింది.
ఒక రూపాయి వేయాలి... నాప్ కిన్ పొందాలి...
విద్యార్థినిల కోసం శానిటరీ నాప్కిన్ వెండింగ్ మిషన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. మిషన్‌లో ఒక్క రూపాయి వేసి ఈ నాప్కిన్ పొందవచ్చని సంస్థ డైరెక్టర్ ఇవా తెలిపారు. ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని విద్యార్థినులకు సూచించారు. బాగా చదువుకొని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆమె ఆకాక్షించారు.
ఇదీ చూడండి : దిల్లీ దంగల్: 'ఆమ్ ఆద్మీ'కి బంగాల్ దీదీ మద్దతు