ETV Bharat / state

'అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవు'

పటాన్​చెరు మండలంలోని పలు గ్రామాల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతను జిల్లా పంచాయతీ అధికారి సురేశ్ మోహన్ పరిశీలించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా ఉపక్షించేది లేదని హెచ్చరించారు. అనుమతులు లేకుండా ఎలాంటి నిర్మాణాలు చేయకూడదని హెచ్చరించారు.

Illegal structures demolish , sangareddy demolish
పటాన్​చెరులో అక్రమ నిర్మాణాల కూల్చివేత, సంగారెడ్డి అక్రమ నిర్మాణాలు
author img

By

Published : Apr 28, 2021, 7:03 AM IST

ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సంగారెడ్డి జిల్లా పంచాయతీ అధికారి సురేశ్ మోహన్ తెలిపారు. పటాన్​చెరు మండలం ఇంద్రేశం గ్రామ పరిధిలో వరుసగా మూడో రోజు, అలాగే అమీన్​పూర్ మండలం పటేల్ గూడ గ్రామపంచాయతీ పరిధిలోనూ అక్రమ నిర్మాణాలను కూల్చి వేశారు.

ఈ కూల్చివేతలను డీఎల్పీవో సతీశ్​ రెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఇంద్రేశం, కృష్ణారెడ్డి పేట గ్రామాల్లో అక్రమ నిర్మాణాలు నివారించడంలో విఫలమైనందున సర్పంచ్, ఉప సర్పంచ్​లకు కలెక్టర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇదీ చదవండి: కొవిడ్​ నిబంధనలు పాటించాలంటూ ప్రజల్లో అవగాహన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.