సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలలో ఐఐటీ-నీట్ ప్రవేశ పరీక్షలకు శిక్షణ తరగతులు, ఆటల పోటీలను ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ప్రారంభించారు. పేద విద్యార్థుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలు వివరిస్తూ... కష్టపడి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు. విద్యార్థులతో కలిసి కాసేపు ఆటలు ఆడిన ఎమ్మెల్యే ఆట వస్తువులు, భోజనం ప్లేట్లు అందించారు.
ఇదీ చూడండి: శస్త్రచికిత్సకు సహకరించినందుకు పాలాభిషేకం