ETV Bharat / state

ఐఐటీ హైదరాబాద్‌లో.. అబ్బురపర్చిన ఆవిష్కరణల ప్రదర్శన - IIT Hyderabad Innovation Day 2023

IIT Hyderabad Innovation Day: ఆవిష్కరణలు గురించి పెట్టుబడిదారులు, పారిశ్రామిక వేత్తలకు తెలిసేలా ఐఐటీ హైదరాబాద్ విన్నూత్న ప్రయత్నం చేసింది. ఇన్నోవేషన్ డే పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. ఐఐటీలో ఇంక్యూబేషన్ సెంటర్‌లో చేసిన ఆవిష్కరణలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర శాస్త్రసాంకేతిక శాఖ కార్యదర్శి శ్రీవారి చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పారిశ్రామిక దిగ్గజాలు, విద్యార్థుల ఆవిష్కరణలను ఆసక్తిగా పరిశీలించారు.

IIT Hyderabad Innovation
IIT Hyderabad Innovation
author img

By

Published : Jan 8, 2023, 1:13 PM IST

ఐఐటీ హైదరాబాద్‌లో.. అబ్బురపర్చిన ఆవిష్కరణల ప్రదర్శన

IIT Hyderabad Innovation Day: ఆవిష్కరణల కేంద్రం ఐఐటీ హైదరాబాద్ మొట్టమెదటిసారిగా ఇన్నోవేషన్ డే ఘనంగా నిర్వహించింది. ఇందులో ఐఐటీ హైదరాబాద్ ఇంక్యూబెషన్ కేంద్రంలో అభివృద్ధి చేసిన 30ఆవిష్కరణలను ప్రదర్శించారు. ఆవిష్కరణను ఉత్పత్తి స్థాయికి తీసుకెళ్లినప్పుడే పూర్తి స్థాయి ఫలితం లభిస్తుందని కేంద్ర శాస్త్రసాంకేతిక శాఖ కార్యదర్శి శ్రీవారి చంద్రశేఖర్ పేర్కొన్నారు. విద్యార్థులు చేస్తున్న అద్భుత ఆవిష్కరణలకు పారిశ్రామిక వేత్తలు తమ సంస్థల్లో చోటు కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఐఐటీ హైదరాబాద్‌ను ఆవిష్కర్తలకు స్వర్గథామంగా చేయాలన్నది తమ లక్ష్యం అని డైరెక్టర్ ఆచార్య బీఎస్ మూర్తి తెలిపారు.

"2020-21 సంవత్సరంలో 4వేల 600 అంకుర సంస్థలు మూతపడ్డాయని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. దేశంలో ఆవిష్కరణలకు సంబంధించి 80 వేల అంకుర సంస్థలు పుట్టుకురావడం గర్వంగా చెప్పుకునే పరిణామం. అదే సమయంలో మూతపడకుండా నియంత్రించాల్సిన అవసరమూ ఉంది. ఈ సంస్థలో జరుగుతున్న ఆవిష్కరణలు కింది స్థాయి సామాన్యుల వరకు చేరాలి. కేవలం ఐఐటీ, ఎన్‌ఐటీలకే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాలకు చేరాలని ఆకాంక్ష." - శ్రీవారి చంద్రశేఖర్, కేంద్ర శాస్త్రసాంకేతిక శాఖ కార్యదర్శి

"సాంకేతికత-పరిశోధన, సాంకేతిక-ఆవిష్కరణలకు ఐఐటీలో ప్రాధాన్యమిస్తాం. ప్రపంచంలో ఏ మూలలో వినూత్నమైన ఆలోచన ఉన్నా.. దాన్ని ఐఐటీ హైదరాబాద్‌లో అభివృద్ధి చేయడానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తాం. ఈ క్రతువులో పారిశ్రామిక వేత్తలు చేయూతనివ్వాలని ఆకాంక్షిస్తున్నా." -ఆచార్య బీఎస్ మూర్తి, ఐఐటీహెచ్ డైరెక్టర్

క్యాన్సర్‌ను గుర్తించే కిట్‌: ఐఐటీ హైదరాబాద్ ఇంక్యూబేషన్ సెంటర్లో చేసిన ముఖ్యమైన 30 ఆవిష్కరణలను ప్రదర్శించారు. ఇంటి వద్దే అతి తక్కువ ధరలో సర్వైకల్ క్యాన్సర్ గుర్తించే కిట్‌ను బయోమెడికల్ విభాగానికి చెందిన ఆచార్యులు అరవింద్ కుమార్ రెంగన్ నేతృత్వంలో రూపొందించారు. చుట్టూ ఉన్న పరిసరాల నుంచే బ్యాటరీలను ఛార్జ్ చేసే విన్నూత్నమైన సాంకేతికతను గ్రీన్ పీఎంయూ సెమీ అనే అంకుర సంస్థ అభివృద్ధి చేసింది.

యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టిరీయల్ ఆవిష్కరణలు: లో దుస్తుల్లో శిలీంద్రాల వల్ల మహిళలు జననాంగాల వద్ద ఇన్ఫెక్షన్ల భారీన పడుతుంటారు. ఈ సమస్యకు పరిష్కారాన్ని చూపారు ఐఐటీ ఆచార్య ముద్రికా ఖండేల్‌వాల్ నేతృత్వంలోని బృదం. ఆచార్య సుహాస్ రంజన్ నేతృత్వంలో ఏర్పాటైన ఎల్కమీ అనే అంకుర సంస్థ యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టిరీయల్ ఆవిష్కరణలు చేశారు. వీరి ఆవిష్కరణలను గదిలోని గాలిని శుభ్రం చేయడం.. ఆసుపత్రుల్లో మంచాలు, ఇతర పరికరాలకు ఉపయోగించవచ్చని వారు స్పష్టం చేశారు.

నడవలేని దివ్యాంగుల కోసం వీగో అనే పరికరం: గర్భాశాయ సమస్యలతో గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉన్న మహిళలకు ఉపయుక్తంగా ఉండే పరికరాన్ని కౌస్తుబా మెడిటెక్ అనే అంకుర సంస్థ బ్రూనో మంత్ర పేరుతో ఓ పరికరాన్ని రూపొందిస్తోంది. ల్యాప్రోస్కోపీలో మెరుగైన చికిత్స అందించేలా.. మానవ వనరుల అవసరాన్ని తగ్గించేలా రైబో అంకుర సంస్థ పరికరాలను, సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. కాలిన గాయాలు తదనంతర ఇన్‌ఫెక్షన్ల సమస్యకు పరిష్కారం చూపేలా ఆచార్య జ్యోత్స్నేందు గిరి ఆధ్వర్యంలో జెల్‌ను రూపొందిచారు. నడవలేని దివ్యాంగుల కోసం మై ఉడాన్ అంకుర సంస్థ అతి తక్కువ ధరలో వీగో అనే పరికారన్ని రూపొందించింది.

సైయెంట్ వ్యవస్థాపకులు, ఐఐటీహెచ్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ అధ్యక్షుడు బీవీఆర్ మోహన్ రెడ్డి రచించిన ఇంజినీరింగ్ ఇన్ ఇండియా అనే పుస్తకాన్ని కార్యక్రమంలో భాగంగా ఆవిష్కరించారు. యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పుస్తకాన్ని రచించానని మోహన్ రెడ్డి తెలిపారు. విద్యార్థుల ఆవిష్కరణలను పెద్ద ఎత్తున ఉత్పత్తి చెయ్యడానికి అవసరమయ్యే ఆర్థిక సాయం అందించడానికి పలువురు పెట్టుబడిదారులు, వ్యాపారులు ఆసక్తి చూపించారు.

ఇవీ చదవండి: ప్రయోగం చేసెదేలా..? సైన్సు విద్యార్థుల అవస్థలకు తప్పని పాట్లు..

శరవేగంగా రామమందిర నిర్మాణ పనులు.. రూ.65 కోట్లతో ప్రవేశ ద్వారాలు.. ఆలయ గోడలపై..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.