సంగారెడ్డికి గోదావరి నీళ్లు ఇవ్వాలని స్థానిక ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పఠాన్ చెరు నుంచి సంగారెడ్డికి గోదావరి నీటి తరలింపుపై ఈ నెలాఖరు లోపు ప్రభుత్వం ప్రకటన చేయాలని విజ్ఞప్తి చేశారు. అలా చేయనట్లైతే... ఆగస్టు 10న సంగారెడ్డి అంబేడ్కర్ స్టేడియంలో లక్ష మందితో దీక్ష చేస్తానని ఆయన ప్రకటించారు. తాను చేయబోయే దీక్ష ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదని.. తమ సమస్య తీవ్రతను సర్కారు దృష్టికి తీసుకెళ్లాడానికేనని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.
ఇవీ చూడండి: కోటుల్లో గోనె సంచి కోటు వేరయా