ETV Bharat / state

'మేము అలా చేస్తే ప్రాంతీయ పార్టీలు పుట్టేవి కావు' - SANGAREDDY MLA

కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికల సంఘం విధుల్లో జోక్యం చేసుకోలేదని..ఒకవేళ అలా చేసి ఉంటే ప్రస్తుతం ఇన్ని ప్రాంతీయ పార్టీలు పుట్టేవి కావని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు.

మేము అధికారంలో ఉన్నప్పుడు ఈసీ విధుల్లో జోక్యం చేసుకోలేదు : జగ్గారెడ్డి
author img

By

Published : May 16, 2019, 11:14 PM IST

ప్రాదేశిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మంచి ఫలితాలు వస్తాయని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. ఎంపీపీ, జడ్పీ ఛైర్మన్ల ఎన్నికకు 40 రోజుల గడువు పెట్టడం దారుణమని విమర్శించారు. చిన్న తప్పులను బూచిగా చూపిస్తూ తెరాస నేతలు బెదిరింపు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
లోక్‌సభ ఫలితాలు ఎలా ఉన్నా..పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్​నే కొనసాగించాలని అధిష్ఠానానికి లేఖ రాస్తానని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. పీసీసీ చీఫ్​గా తొలివిడతలో శ్రీధర్‌బాబుకు, రెండో విడతలో రేవంత్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. రేవంత్, ఉత్తమ్, రేణుకా చౌదరి, కోమటిరెడ్డి, కొండా తప్పక గెలుస్తారని..అందులో రేణుక, కోమటిరెడ్డి , ఉత్తమ్‌లు కేంద్ర మంత్రులవుతారని జగ్గారెడ్డి జోస్యం చెప్పారు.

ఇవీ చూడండి : మల్లన్న సాగర్​ ప్రాజెక్టును ఆపే ప్రసక్తే లేదు: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.