ETV Bharat / state

'పెళ్లి జరిపిస్తే ఓకే.. లేదంటే టవర్​ నుంచి దూకేస్తా' - CANDIDATE RAJU

ప్రేమించిన యువతితో తన పెళ్లి జరిపించాలని లేకుంటే ఆత్మహత్య చేసుకుంటానని ఓ యువకుడు సెల్ టవర్ ఎక్కాడు. ఇరు కుటుంబాలు తమ పెళ్లికి ఒప్పుకోవాలని కోరుతున్నాడు.

రాజు కిందకు దిగిరావాలి : కుటుంబ సభ్యులు
author img

By

Published : Apr 1, 2019, 11:22 AM IST

Updated : Apr 1, 2019, 11:50 AM IST

ప్రేమించిన యువతితో పెళ్లి జరిపించకుంటే సెల్ టవర్ నుంచి దూకేస్తా : రాజు
సంగారెడ్డి జిల్లా కంది మండల తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో రాజు అనే వ్యక్తి సెల్ టవర్ ఎక్కాడు. రాజు, తన ఇంటి పక్కనే నివాసం ఉండే యువతి ఇద్దరూ ఏడాది కాలంగా ప్రేమించుకుంటున్నారు. గత నెల ఇరువురూ ఇంట్లో నుంచి పారిపోయి తిరుపతిలోని ఓ గుడిలో పెళ్లి చేసుకున్నారని రాజు సోదరుడు గణేష్ తెలిపారు. అక్కడి పోలీసులు వీరిని పట్టుకుని ఇంటికి పంపినట్లు సోదరుడు స్పష్టం చేశారు.

అనంతరం ఇంటికి వచ్చిన తర్వాత అమ్మాయిని దాచి పెట్టి, ఆమె కుటుంబ సభ్యులు తన తమ్ముణ్ణి కొట్టినట్లు వెల్లడించారు. ఈ క్రమంలో ప్రేమించిన యువతితో పెళ్లి చేస్తేనే కిందికి వస్తానని లేదంటే దూకేస్తానని రాజు చెబుతున్నట్లు గణేష్ వాపోయారు. రాజు కిందకు దిగిరావాలని కుటుంబ సభ్యులు బతిమిలాడుతున్నారు.

ఇవీ చూడండి :నేతల వలసలతో కాంగ్రెస్ ఉక్కిరిబిక్కిరి

Intro:tg_srd_56_01_cell_tower_ekkina_yuvakudu_ab_c6 రిపోర్టర్: భాస్కర్ రెడ్డి, సంగారెడ్డి ( ) సంగారెడ్డి జిల్లా కంది మండల తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఉన్న సెల్ టవర్ పైకి రాజు అనే యువకుడు ఎక్కాడు. ప్రేమ పెళ్లికి ఇరువర్గాల కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో.. సెల్ టవర్ ఎక్కినట్లు రాజు(సెల్ టవర్) అన్న గణేష్ తెలిపారు. రాజు, తన ఇంటి పక్కననే ఉన్న యువతి ఇద్దరూ గత సంవత్సర కాలంగా ప్రేమించుకుంటున్నారు. గత నెల ఇరువురు ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారని.. పోలీసులు వీరిని తిరుపతిలో పట్టుకున్నట్లు రాజు అన్న పేర్కొన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మాయిని కనపడకుండా దాచి పెట్టి.. అమ్మాయి కుటుంబ సభ్యులు తన తమ్ముణ్ణి కొట్టినట్లు తెలిపారు. ప్రేమించిన యువతితో పెళ్లి చేస్తేనే కిందికి వస్తానని.. లేదంటే దుకేస్తానని చెబుతున్నట్లు స్పష్టం చేశారు. రాజు కిందికి రావాలని కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.

Body:బైట్: గణేష్, రాజు అన్న

Conclusion:విజువల్, బైట్
Last Updated : Apr 1, 2019, 11:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.