సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పెద్ద చెరువులో చేపలు పెద్ద ఎత్తున చనిపోవడం వల్ల మత్స్యకారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పీసీబీ, మత్స్యశాఖ అధికారులు చెరువు ప్రాంతాన్ని పరిశీలించారు. పురపాలిక కేంద్రంలో ఉన్న పెద్ద చెరువును ఎస్పీఎఫ్ ఆధ్వర్యంలో తొలి జీవ వైవిధ్య కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నారు.
450 ఎకరాల్లో... రూ.2 కోట్లు నష్టం
చెరువుకు నీరు వచ్చే చోట, వెళ్ళే చోట నీటి నమూనాలు సేకరించామని పీసీబీ అధికారులు వెల్లడించారు. పెద్ద ఎత్తున చేపలు చనిపోవడం వల్ల మత్స్యకారులకు తీరని నష్టం వాటిల్లిందని మత్స్యశాఖ అధికారులు తెలిపారు. వర్షాలు వచ్చిన సమయంలో కాలుష్య జలాలను వదిలి పెట్టడం వల్లే పెద్ద ఎత్తున చేపలు చనిపోయాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 450 ఎకరాల విస్తీర్ణంలోని ఈ చెరువులో రూ.2 కోట్లు మేర నష్టం జరిగిందని వాపోయారు. గతంలో గండిగూడ వద్ద చెరువులో కూడా కాలుష్యంతోనే చేపలు చనిపోయాయని పేర్కొన్నారు. విషయాన్ని అధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తగిన న్యాయం చేయాలని మత్స్యకారులు కోరారు.