ఈనాడు దినపత్రికలో ప్రచురితమైన "బతుకు బండికి ఊతమివ్వరూ" అనే కథనం ఆధారంగా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సుమోటోగా కేసును విచారణకు స్వీకరించింది. సంగారెడ్డి జిల్లా మునిమాణిక్యం గ్రామానికి చెందిన మొగులయ్య దివ్యాంగుడు. మూడేళ్లుగా బ్యాటరీ సైకిల్ మంజూరు చేయాలంటూ... కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా... అధికారులు స్పందించలేదు.
దివ్యాంగుడి వేదనను ఈనాడు పత్రికలో ప్రచురించగా... హెచ్చార్సీ కేసు విచారణకు ఆదేశించింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేసి ఈనెల 24లోగా సమర్పించాలంటూ సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు హెచ్చార్సీ ఆదేశాలు జారీచేసింది.
ఇదీ చూడండి: ఎయిరోస్పేస్ హబ్‌గా తెలంగాణ: మంత్రి కేటీఆర్