సంగారెడ్డి జిల్లాలో హోలీ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. పిల్లలు, పెద్దలు ఎలాంటి తేడాలు లేకుండా సంతోషంగా రంగులను ఒకరిపై ఒకరు చల్లుకుంటూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. రంగు నీళ్లను ఆట వస్తువుల్లో నింపి పిల్లలు హోలీ ఆడారు. కానీ... కరోనా మహమ్మారి భయానికి చాలా వరకు వేడుకలు జరుపుకోవడానికి అంతగా ఆసక్తి చూపలేదు. కరోనా వ్యాప్తి లేకుంటే పండుగను ఇంకా బాగా జరుపుకునే వారిమని ప్రజలు తెలిపారు.

జిల్లా కేంద్రంలో పీఆర్టీయూ జిల్లా కార్యదర్శి మదన్ గోపాల్ ఆధ్వర్యంలో పండుగను ఘనంగా నిర్వహించారు. పీఆర్సీ, వయోపరిమితి పెంపును ప్రభుత్వం ఆమోదించడంతో మరింత సంతోషంగా ఉన్నామని అన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు చెప్పారు.

ఇదీ చదవండి: కొవిడ్ నిబంధనల మధ్య రంగుల పండుగ