ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రవహించే మంజీరా నదిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో సంగారెడ్డి జిల్లా మనూరు మండలంలోని పులకుర్తి వంతెన వద్ద నది నిండుకుండను తలపిస్తోంది. సంగారెడ్డి జిల్లాతో పాటు ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు నదికి భారీగా వరద వస్తోంది.
ఈ నది సంగారెడ్డి జిల్లా నాగల్గిద్ది మండలంలోని జనవాడ వద్ద తెలంగాణలో ప్రవేశిస్తుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం 96 కిలోమీటర్లు ప్రవహించి నిజామాబాద్ జిల్లాలో గోదావరిలో కలుస్తుంది. గడిచిన మూడేళ్లుగా నీరు లేక ఎండిపోయి బోసిపోయిన మంజీరా నది ఈ ఏడాది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. సింగూరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వస్తోంది.
ఇవీ చూడండి:అపార్ట్మెంట్లో పగిలిన మంజీరా పైప్లైన్.. నదిని తలపించిన సెల్లార్