IIT Hyderabad: కొత్త టెక్నాలజీలు, మారుతున్న సాంగేతికతకు అనుగుణంగా విద్యార్థులను సిద్ధం చేసే యోచనలో భాగంగా ఐఐటీ హైదరాబాద్ బీటెక్‌లో కొత్త ఇంజినీరింగ్ కోర్సు ప్రవేశపెట్టింది. ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్‌లో ఐసీ డిజైన్ అండ్ టెక్నాలజీ కోర్సు ప్రారంభించింది. ఇందుకు సంబంధించిన వివరాలను ఐఐటీ హైదరాబాద్ పీఆర్వో మిథాలీ తెలియజేశారు.
ఈ కోర్సు గురించి మరింత సమాచారం కోసం యూట్యూబ్ వీడియోను కూడా రూపొందించారు. ఈ వీడియోలో కోర్సుకు సంబంధించిన పూర్తి సమాచారం, భవిష్యత్ అవకాశాలు, ఫీజు వివరాలు ఉంటాయని మిథాలీ తెలిపారు. https://youtu.be/sF-9X9OShcM యూట్యూబ్ లింక్‌లో ఈ వీడియో చూడవచ్చు. ఈ కోర్సుకు సంబంధించిన ఏమైనా అనుమానాలుంటే తమను నేరుగా కూడా సంప్రదించవచ్చని మిథాలీ తెలిపారు.
ఇవీ చదవండి: KCR inaugurates Banjara Bhavans : 'బంజారాహిల్స్‌లో బంజారాలకే చోటు లేకుండా పోయింది'
దేశంలో చీతాల సందడి షురూ.. చూసేందుకు ఇప్పుడే రావొద్దన్న మోదీ!