సంగారెడ్డి జిల్లాలోని పరిశ్రమల ప్రతినిధులతో రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు సమీక్షా సమావేశం నిర్వహించారు. విశాఖపట్నం గ్యాస్ లీకేజీ ఘటన దృష్ట్యా జిల్లాలోని పరిశ్రమలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
పరిశ్రమల్లో వరుస ప్రమాదాలు జరగడంపై మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల పనితీరుపై అంసతృప్తి వ్యక్తం చేశారు. పరిశ్రమలకు అన్ని విధాల ప్రభుత్వం తరపున సాయం అందిస్తామన్నారు. కానీ ప్రజల ఆరోగ్యం విషయంలో మాత్రం రాజీపడమని ఆయన స్పష్టం చేశారు. పారిశ్రామిక వ్యర్థాల నిర్వహణ సక్రమంగా ఉండాలని.. నిబంధనలు పాటించాలని వారికి హరీశ్‌రావు సూచించారు.
ఇదీ చూడండి :చెప్పిన రకం వరి వేయకపోతే... రైతుబంధు వర్తించదు