కళాశాలలు, పాఠశాలలు కేవలం మార్కులు సాధించేందుకే కాదని ఉన్నత విలువలు నేర్పేవిగా ఉండాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలో దాదాపు 11 కోట్ల రూపాయలతో గ్రేటర్ కార్యాలయం, బాలికోన్నత పాఠశాలలను ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డితో కలిసి హరీశ్‌రావు ప్రారంభించారు.
10 నుంచి డిగ్రీ వరకు ఒకే చోట ఏర్పాటు చేసి ఎడ్యుకేషనల్ హబ్‌గా ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి తయారు చేశారని మంత్రి తెలిపారు. ఇంటర్, డిగ్రీ కళాశాలలో ఉత్తీర్ణత శాతం పెరగాలని సూచించారు. అవసరమైతే పదవీ విరమణ చేసిన అధ్యాపకులతో ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించేందుకు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సిద్ధంగా ఉన్నారని హరీశ్ రావు పేర్కొన్నారు. ఆడపిల్లల్లో ఆత్మవిశ్వాసం, ధైర్యం పెంచాలన్నారు. సామాజిక బాధ్యత కలిగిన యువతను రేపటి తరానికి అందించాల్సిన బాధ్యత ఉందని వివరించారు.
- ఇదీ చూడండి: త్వరలో లోకాయుక్త, మానవ హక్కుల సంఘాల ఏర్పాటు