ETV Bharat / state

గ్రీన్​ఛాలెంజ్​లో భాగంగా మొక్కలు నాటిన సంగారెడ్డి ఎమ్మెల్యే

రాజ్యసభ సభ్యులు ఎంపీ సంతోష్ కుమార్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్​ను స్వీకరించిన పటాన్​చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా బొల్లారం మోడల్ స్కూల్ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం మెదక్ ఎంపీ ప్రభాకర్​రెడ్డి, మెదక్ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, భారతి నగర్, రామచంద్రాపురం డివిజన్ కార్పొరేటర్లకు గ్రీన్​ ఛాలెంజ్ విసిరారు.

green challenge accepted by patancheru mla mahipal reddy
గ్రీన్​ఛాలెంజ్​లో భాగంగా మొక్కలు నాటిన సంగారెడ్డి ఎమ్మెల్యే
author img

By

Published : Sep 19, 2020, 10:03 PM IST

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తన పుట్టిన రోజు సందర్భంగా రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ విసిరిన గ్రీన్​ ఛాలెంజ్​ను స్వీకరించారు. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపల్ పరిధిలోని తెలంగాణ మోడల్ స్కూల్ ఆవరణలో మూడు మొక్కలు నాటారు. అనంతరం మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, మెదక్ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, రామచంద్రపురం కార్పొరేటర్ అంజయ్య, భారతినగర్ డివిజన్ కార్పొరేటర్ సింధు ఆదర్శ రెడ్డిలకు ఛాలెంజ్ విసిరారు.

ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మొక్కలు నాటాలని కోరుతూ గ్రీన్ ఛాలెంజ్​కు తనని నామినేట్ చేయడం సంతోషకరంగా ఉందన్నారు. దేశవ్యాప్తంగా గ్రీన్ ఛాలెంజ్ ఉద్యమానికి మంచి స్పందన లభిస్తోందన్నారు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఇటీవల సినీ నటుడు ప్రభాస్ తమ నియోజకవర్గ పరిధిలోని కాజిపల్లి అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకోవడమే అన్నారు.

ఇవీ చూడండి: బకాయిలు విడుదల చేయాలని కేంద్రానికి కేటీఆర్​ లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.