సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం అండూరు గ్రామ పరిధిలో గడ్డి తీసుకెళ్తున్న డీసీఎంకు విద్యుత్ తీగలు తగలడం వల్ల మంటలు వ్యాపించాయి. దీనితో గడ్డితో పాటు డీసీఎం కూడా పూర్తిగా దగ్ధం అయ్యింది. ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడం వల్ల స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
ఘటనాస్థలికి అగ్నిమాపక శకటం సరైన సమయానికి అందుబాటులోకి రాకపోవడం వల్లే డీసీఎం పూర్తిగా కాలిపోయిందని స్థానికులు చెబుతున్నారు. వెంటనే మంటలను ఆర్పడానికి అగ్నిమాపక సిబ్బంది వచ్చి ఉంటే ఈ ప్రమాదం సంభవించేది కాదని అన్నారు.
ఇవీ చూడండి: 'పుర'పోరుపై రేపు రాజకీయ పార్టీలతో ఈసీ సమావేశం