సంగారెడ్డి జిల్లా బొల్లారం పోలీసులు కరోనాపై వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. కరోనా వైరస్ ఆకారంలో హెల్మెట్ ధరించిన ఓ రక్షకభటుడు రోడ్డుపై వెళ్లే వారికి అవగాహన కల్పిస్తున్నాడు. ఈ వీడియోను ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి ట్విట్టర్లో పెట్టారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. కొవిడ్- 19పై ప్రజలకు కొత్త తరహాలో అవగాహన కల్పించడంలో పోలీసులు చూపిన చొరవను స్వాగతిస్తూ గవర్నర్ ట్వీట్ చేశారు.
ఇవీచూడండి: 'దేశంలో కరోనా కేసులు, మృతుల్లో పురుషులే అధికం'