కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వాలు, అధికారులతో పాటు ప్రజాసంఘాలు, స్వచ్ఛంద సంస్థలు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయి. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో సీఐటీయూ ఆధ్వర్యంలో ఉచితంగా మాస్కులు పంపిణీ చేశారు.
సదాశివపేట బస్టాండు ఆవరణలో ప్రయాణికులకు, ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు, వాహనాదారులకు మాస్కులు పంచిపెట్టారు. కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు సీఐటీయూ నాయకులు.
ఇదీ చూడండి: 'జనతా కర్ఫ్యూను రాజధానిలో పూర్తిగా అమలు చేయలేం'