ETV Bharat / state

సంగారెడ్డి జిల్లాలో తొలి కరోనా మరణం - కరోనా తొలి మరణం

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లో తొలి కరోనా మరణం నమోదైంది. జహీరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని రంజోల్​కు చెందిన 50 ఏళ్ల వ్యక్తి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు.. వైద్యాధికారులు వెల్లడించారు.

First Corona Death in Sangareddy District
సంగారెడ్డి జిల్లాలో తొలి కరోనా మరణం
author img

By

Published : Jul 4, 2020, 10:14 PM IST

సంగారెడ్డి జిల్లాలో జహీరాబాద్​ మున్సిపాలిటీలో తొలి కరోనా మరణం నమోదయింది. మున్సిపాలిటీ పరిధిలోని రంజోల్​కు చెందిన 50 ఏళ్ల వ్యక్తి జూన్ 30న అనారోగ్య లక్షణాలతో హైదరాబాద్​లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. పరీక్షల్లో కరోనా అని తేలడం వల్ల గాంధీ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మరణించారు. శనివారం నాడు మృతదేహాన్ని రంజోల్​కు తీసుకువచ్చారు. వైద్య ఆరోగ్య శాఖ, రెవెన్యూ , పోలీసు అధికారుల పర్యవేక్షణలో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ అంత్యక్రియలు పూర్తి చేశారు. కరోనా మరణంతో అప్రమత్తమైన మున్సిపల్ అధికారులు రంజోల్ గ్రామంలోని ప్రధాన వీధులు అంతర్గత దారుల్లో వైరస్ నివారణ రసాయనాలను పిచికారి చేశారు.

ఇదీ చూడండి: తెలంగాణలో ఆకలి చావుల్లేవు: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.