సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలో పిల్లెట్ పరిశ్రమలోనిపై అంతస్తులో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కార్మికులు విధులు నిర్వహిస్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో సతీష్ అనే కార్మికుడు తీవ్ర అస్వస్థతకు గురవ్వడం మూలానా హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
గాలింపు చర్యలు..
మరో కార్మికుడు రామకృష్ణ ఆచూకీ కోసం పరిశ్రమ సిబ్బంది గాలిస్తున్నారు. రెండు అగ్నిమాపక శకటాల ద్వారా మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఫైర్ సేఫ్టీ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.