సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్లెపల్లి గ్రామ శివారులో కొంతకాలంగా మూసి ఉన్న కేఆర్ ఇంజనీర్ టైర్ల పరిశ్రమలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు సమీప ప్రాంతాలను కమ్మేశాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఆ పరిశ్రమ కొంతకాలంగా మూసి ఉన్నందున ఎలాంటి ప్రాణహాని జరగలేదు.
ఇదీ చూడండి: మూడు కిలోమీటర్లే హద్దు... మరిచారో ఇకపై జప్తు!