రాష్ట్రంలోని సుప్రసిద్ధ ఆలయాలన్నింటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిధులు కేటాయిస్తూ... అభివృద్ధికి బాటలు వేస్తున్నారని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు కొనియాడారు. దేవాలయాల అభివృద్ధికి బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించనున్నట్లు తెలిపారు. సంకష్టహర చతుర్థి వేడుకల్లో భాగంగా సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్ మండలం రేజింతల్ సిద్ధి వినాయకుడిని దర్శించుకున్నారు.
ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. రేజింతల్ సిద్ధి వినాయక ఆలయం ఎంతో మహిమ గల దేవాలయం అని అన్నారు. ఏటా విగ్రహం పెరుగుతూ ఉండడం ఇక్కడి ప్రత్యేకత అని మంత్రి తెలిపారు. ఆలయ అభివృద్ధికి రూ. 2 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.
ఇదీ చదవండి: నీటిపారుదలశాఖకు బడ్జెట్ కేటాయింపులపై కసరత్తు