సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని ఎరువులు, పురుగు మందుల దుకాణాలను ఏడీఏ బిక్షపతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎరువుల దుకాణాల అమ్మకాల్లో మోసాలను అరికట్టేందుకు ఈ-పాస్ విధానాన్ని అమలుచేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. కొనుగోలు కోసం వచ్చిన రైతుల నుంచి వేలిముద్రలు సేకరించి అవసరమైన ఎరువులు, పురుగు మందులు విక్రయించాలని సూచించారు.
రైతులు రానిపక్షంలో కొనుగోలు కోసం వచ్చిన వారి నుంచి ఆధార్ కార్డు, పట్టా పాస్ బుక్ వివరాలు, ఓటర్ గుర్తింపు కార్డు, లేదా క్రెడిట్ కార్డు వివరాలు తీసుకున్న తర్వాత అమ్మకాలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించి అమ్మకాలు చేపడితే చట్ట పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇదీ చూడండి : రాష్ట్రంలో 42 వేలు దాటిన కరోనా కేసులు.. 400పైగా మరణాలు