ETV Bharat / state

రాష్ట్ర వ్యాప్తంగా వర్షం... సంగారెడ్డిలో దుర్భిక్షం... - సంగారెడ్డిలో వర్షాభావ పరిస్థితులు

రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. వాగులు, వంకలు పొంగుతున్నాయి. జలాశయాలు నిండుకుండల్లా దర్శనమిస్తున్నాయి. సంగారెడ్డి జిల్లాలో మాత్రం దీనికి భిన్నమైన పరిస్థితి నెలకొంది. ఇంత వరకూ చెప్పుకోదగ్గ రీతిలో వర్షం పడకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. భూమిలో విత్తనాలు వేసిన అన్నదాత... ఆశగా ఆకాశం వైపు చూస్తున్నాడు.

సంగారెడ్డిలో భిన్న పరిస్థితి
author img

By

Published : Aug 1, 2019, 1:04 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా వర్షం... సంగారెడ్డిలో దుర్భిక్షం...

భారీగా వానలు కురిసి రైతులు పంట చేలలో స్వేదం చిందేలా పనిచేస్తూ... కనిపించే కాలమిది. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నా సంగారెడ్డి జిల్లాలో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. వరుణుడు ముఖం చాటేయడం వల్ల ప్రస్తుత సీజన్​లో అన్నదాతలు మొదలు సామాన్యుల వరకు అంతా ఇబ్బందులు పడుతున్నారు. సాగు, తాగునీటికి ఇబ్బందులు తప్పడం లేదు. ఎండాకాలాన్ని తలపించేలా భానుడు నిప్పులు చెరగుతున్నాడు. దీని వల్ల నేలలో ఉన్న కాస్త తడి కూడా ఆవిరైపోయి పంటలను కాపాడుకోవడానికి రైతులు నానా అగచాట్లు పడుతున్నారు.

పత్తి పంటకు నష్టం

జిల్లాలో ప్రధానంగా పత్తి పంటను సాగు చేస్తున్నారు. ఈసారి రెండు లక్షల పైచిలుకు ఎకరాల్లో విత్తనాలు వేశారు. సాధారణ వర్షపాతం నమోదైతే పత్తి మొక్కలు రెండు అడుగుల ఎత్తు పెరిగేవి. ప్రస్తుతం వర్షాలు లేక మొక్కల్లో పెరుగుదల కనిపించడం లేదు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 44.7 శాతం లోటు వర్షపాతం ఉంది. ఒకట్రెండు రోజులు మినహా చెప్పుకోదగ్గ వర్షాలు కురవలేదు. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నా... ఇక్కడ కురవకపోవడంపై కర్షకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కురిసిన కొద్దిపాటి వర్షం వల్ల కనీసం భూమి కూడా తడవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కల్హేర్​లో మాత్రమే సాధారణం

జిల్లాలో 26 మండలాల్లో కేవలం కల్హేర్​లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది. 22 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు ఉండగా... మూడు మండలాల్లో తీవ్ర దుర్భిక్షం నెలకొంది. కందిలో 77శాతం, గుమ్మడిదలలో 70, హత్నూరలో 64 శాతం లోటు వర్షపాతం ఉంది. సరైన వర్షాలు లేక చెరువుల్లోకి నీళ్లు రాలేదు. భూగర్భ జలాలు సైతం అడుగంటి బోర్లు ఎండిపోతున్నాయి.
జిల్లాలో భారీ వర్షాలు కురిస్తే తప్ప పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశం లేదు. పంటలు కాపాడుకోవడానికి అన్నదాతలు... నీటి కష్టాలు పోవడానికి ప్రజలు వరుణిడి కరుణ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు.

ఇదీ చూడండి : నిండుకుండలా జూరాల ప్రాజెక్టు

Intro:tg_adb_91_01_kuntala_waterfall_avb_ts10031
tg_adb_91a_01_kuntala_waterfall_avb_ts10031

Body:ఏ.లక్ష్మణ్ ఇచ్చోడ జిల్లా ఆదిలాబాద్ బోథ్ నియోజకవర్గం9490917560....
కనువిందు చేస్తున్న కుంటాల జలపాతం
* భారీగా తరలి వస్తున్న సందర్శకులు
.....
( ):- ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని కుంటాల జలపాతం జల జల శబ్దాలతో 80 అడుగుల పై నుంచి గుండంలోకి దుంకుతూ పాల నురగల పరవల్లతో భూతల స్వర్గాన్ని తలపిస్తుంది పర్యాటకులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది రెండు ఎత్తయిన గుట్టల మధ్య లోయ ప్రాంతంలో వృక్షాల మధ్య జాలువారుతున్న కుంటాల జలపాతం ని సందర్శించేందుకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్ర తో పాటు ఆదిలాబాద్, హైదరాబాద్ వరంగల్ కరీంనగర్ నిజామాబాద్ మంచిర్యాల తదితర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు సందర్శనకు వస్తున్నారు ముఖ్యంగా వారాంతపు సెలవులలో జలపాతం వద్ద సందడి నెలకొంటుంది. పర్యాటకులకు పూర్తిస్థాయిలో సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా సందర్శకులు అధికారులను కోరుతున్నారు ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాల కారణంగా భారీగా వరద నీరు వచ్చి చేరడంతో కుంటాలలో నీటి కళ ఉట్టిపడుతుంది.
పిటూసి:- ఆన్నేల లక్ష్మణ్ ఈటీవీ భారత్ బోథ్ నియోజకవర్గం, ఆదిలాబాద్ జిల్లా

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.