సంగారెడ్డిలోని అపోలో డయాగ్నస్టిక్ ల్యాబ్‌లో తప్పుడు నివేదికలు ఇచ్చారంటూ టెస్టింగ్ సెంటర్ ఎదుట రోగి బంధువులు ఆందోళన నిర్వహించారు. మైత్రి అనే మహిళ గతనెల 23న ఐఎల్-6 పరీక్ష చేయించుకోగా 999 పాయింట్లు ఉన్నట్లు రిపోర్టు ఇచ్చారు. సాధరణంగా 7పాయింట్లకు మించకూడని ఐఎల్-6 ఈస్థాయిలో ఉండే సరికి.... వెంటనే హైదరాబాద్‌లోని మరో ల్యాబ్‌లో పరీక్ష చేపించగా 1.5 ఉన్నట్లు వచ్చింది.
దీనిపై బాధితురాలి తండ్రి చక్రధర్ డయాగ్నస్టిక్ సెంటర్‌కు వెళ్లి వివరణ కోరగా.... తమకు సంబంధం లేదని సమాధానం ఇచ్చారు. జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి గాయత్రి దేవికి ఫిర్యాదు చేయగా.... అనుమతి లేకుండా నిర్వహిస్తున్న సెంటర్‌కు గతంలో 10వేల జరిమానా విధించామని, త్వరలో సీజ్ చేస్తామని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: నీ అరెస్టులకు.. కేసులకు భయపడే వ్యక్తిని కాదు: ఈటల