సంగారెడ్డి జిల్లా నారాయణ్‌ఖేడ్ పట్టణంలో గల ఎనిమిది మద్యం దుకాణాల్లోని నిల్వలను స్థానిక ఆబ్కారీ సీఐ, ఇతర అధికారులు పరిశీలించారు. మద్యం నిల్వలపై నివేదిక ఇవ్వాలని ఆబ్కారీ శాఖ ఉన్నతాధికారులు స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కొవిడ్-19 లాక్డౌన్ సమయంలో సీజ్ చేసిన మద్యం దుకాణాలను తెరిచి నిల్వలను పరిశీలించారు. సీజ్ చేసినప్పడు ఉన్న నిల్వలు.. ప్రస్తుతం ఉన్న నిల్వలపై నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.
ఇదీ చూడండి: కరోనా లక్షణాల పరిశోధనలో మలుపు