ETV Bharat / state

24లోపు అంగీకార పత్రం సమర్పించాలి : కలెక్టర్ - JNNrum, vambay houses news today

సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్, పటాన్ చెరు మండలాల్లో జెఎన్ఎన్​యూఆర్​ఎం, వాంబే పథకాల్లో భాగంగా నిర్మించిన గృహాలకు ఈనెల 24 తేదీలోపు అంగీకార పత్రం సమర్పించాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు లబ్ధిదారులకు సూచించారు.

Breaking News
author img

By

Published : Sep 19, 2020, 2:23 PM IST

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం రామేశ్వరం బండ, అమీన్​పూర్ మండలం నర్రెగూడెం గ్రామాల్లో జేఎన్ఎన్​యూ ఆర్ఎం, వాంబే పథకంలో భాగంగా నివాస సముదాయాలు నిర్మించారు. వీటిల్లో నివసించేందుకు గ్రేటర్ పరిధిలోని శేరిలింగంపల్లి , చందానగర్, మియాపూర్ ప్రాంతాల్లో ఉన్నవారు అర్జీ పెట్టుకున్నారు. వీరికి ఈ నెల 24 తేదీలోపు తమ అంగీకార పత్రం సమర్పించాలని జిల్లా పాలనాధికారి హనుమంతరావు పేర్కొన్నారు.

ప్రభుత్వ నిర్ణయం మేరకు

రామేశ్వరంబండ, నర్రెగూడెం ప్రాంతాల్లో నిర్మించిన జేఎన్ఎన్​యూఆర్ఎం, వాంబే గృహాలను అర్జీదారులకు కేటాయించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.

ఆ సంవత్సరాల్లోని వారికే..

ఈ నేపథ్యంలో పటాన్​చెరు తహసీల్దార్ కార్యాలయం లేదా సంగారెడ్డిలోని గృహ నిర్మాణ శాఖ జిల్లా మేనేజర్ కార్యాలయాల్లో 24లోగా అంగీకార పత్రం, రసీదు ప్రతి, హౌసింగ్ ఐడీ కార్డు, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్​ను సమర్పించాలని దరఖాస్తుదారులకు కలెక్టర్ సూచించారు. ఈ అవకాశాన్ని 2004 ,2005 సంవత్సరాల్లో దరఖాస్తు చేసుకున్న వారు వినియోగించుకోవాలని కోరారు.

ఇవీ చూడండి : డిప్యూటీ తహసీల్దార్ పదోన్నతులపై సర్కార్​ కసరత్తు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.