సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారం పారిశ్రామిక వాడలో పార్లే ఆగ్రో పరిశ్రమలో ప్రమాదం చోటుచేసుకుంది. పరిశ్రమలోకి కొత్తగా తెచ్చిన యంత్రాన్ని రోహిత్ జ్యోషి అనే ఎలక్ట్రికల్ ఇంజినీర్ పరిశీలించేందుకు దగ్గరకు వెళ్లారు.
ప్రమాదవశాత్తు యంత్రంలో పడి తీవ్రంగా గాయపడి.. అక్కడికక్కడే మృతి చెందారు. బీడీఎల్ పోలీసులు.. మృతదేహాన్ని శవపరీక్షకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి:- అమెరికా అధ్యక్షుడి పేరుతో భారత్లో ఓ గ్రామం!