సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మున్సిపల్ కోఆప్షన్ సభ్యుల ఎన్నిక పూర్తయింది. నూతన సభ్యులుగా అంబాదాస్, లయక్, సాబేరాబేగం, యశోద ఎన్నికయ్యారు. ఏడుగురు తెరాస కౌన్సిలర్లు సహా ఎక్స్ అఫిషియో సభ్యులు ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ షారుఖ్ హుసేన్ల మద్దతుతో ఎన్నిక ఏకపక్షంగా జరిగింది.
బహిష్కరించిన కాంగ్రెస్
కాంగ్రెస్ కౌన్సిలర్లు సమావేశాన్ని బహిష్కరించగా కోరం సరిపోవడంతో ఎన్నికల అధికారి ప్రక్రియ పూర్తి చేశారు. అనంతరం ఎన్నికైన కో ఆప్షన్ సభ్యులకు ధ్రువపత్రాలను అందజేశారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ నూతన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు.