జూలై నెల 15వ తేదీ నుంచి గ్రామాల్లో బహిరంగంగా చెత్త వేయకూడదని, ప్రతీ ఒక్కరూ తడి, పొడి చెత్తను వేరు చేసి పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బందికి ఇవ్వాలని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సూచించారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో నిర్మించిన డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలను ఆయన ప్రారంభించారు.
గ్రామీణ ప్రాంతాల్లో బహిరంగంగా చెత్త వేస్తే ఇక నుంచి జరిమానాలు విధించడం జరుగుతుందని ఎమ్మెల్యే హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలని ఆయన సూచించారు. అంత్యక్రియల కోసం ఎవరికీ ఇబ్బంది కలగకూడదు అన్న సదుద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి గ్రామంలో వైకుంఠ ధామాలను నిర్మించడం జరుగుతుందన్నారు. నియోజకవర్గంలోని 55 గ్రామపంచాయతీలో వైకుంఠ ధామాలు, డంపింగ్ యార్డ్ల నిర్మాణం పూర్తైందని ఎమ్మెల్యే తెలిపారు.
ఇదీ చదవండి : కరోనా సోకితే గాంధీ ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటా: మంత్రి పువ్వాడ