కాషాయం జెండా త్వరలోనే తెలంగాణ అసెంబ్లీ మీదకు వస్తుందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. తెరాస కుండకు ఒకటో రంధ్రం దుబ్బాకలో కొడితే, రెండో రంధ్రం జీహెచ్ఎంసీలో కొట్టామని తెలిపారు. ఇక మూడో రంధ్రం నాగర్జునసాగర్లో కొడితే... సారు ఫామ్ హౌస్‌కి వెళతారని ఎద్దేవా చేశారు.
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో వివిధ పార్టీల నుంచి భాజపాలో చేరుతున్న వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల తర్వాత దిల్లీకి వెళ్లిన కేసీఆర్ ఇరవై రోజుల వరకు కనిపించలేదని దుయ్యబట్టారు. ప్రజలు నరేంద్ర మోదీ నాయకత్వాన్ని కోరే రెండోసారి అధికారాన్ని కట్టబెట్టారని తెలిపారు. ఆయన ప్రపంచ స్థాయి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారని అన్నారు.
ఇదీ చదవండి: రాష్ట్రాల సీఎస్‌లతో కేంద్ర కేబినెట్ కార్యదర్శి సమీక్ష