సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం రుద్రారంలో హైదరాబాద్ గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో రమాదేవి, పార్థసారథి అనే ఇద్దరు పరిశోధక విద్యార్థులకు వేర్వేరు విభాగాల్లో డాక్టరేట్లు వచ్చాయని... వారి పరిశోధనలకు మార్గదర్శకం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ ఈఈసీఈ విభాగాధిపతి మంజునాథా చారి తెలిపారు.
నాణ్యత అభివృద్ధికి
రమాదేవి ఏరియా జనరేషన్ టెక్నిక్‌తో సమర్థవంతమైన చిత్రాన్ని ఆవిష్కరించడంపై అధ్యయనం, విశ్లేషణ, దానిపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించింది. ఈ పరిశోధనలో వేద గణితాలను ఉపయోగించి సవరించిన ఏరియో జనరేషన్ టెక్నిక్ స్కేలుతో సమర్థవంతమైన ఇమేజ్ స్కేలింగ్ ప్రాసెసర్ తక్కువ మెమరీ అవసరాలు, అధిక నాణ్యత, అధిక పనితీరుతో రియల్ టైమ్ ఇమేజ్ మెరుగుదల అనువర్తనాల కోసం తక్కువ ఖర్చుతో, తక్కువ శక్తి గల వీఎఫ్ఎస్ సర్క్యూట్‌ను రూపొందించడానికి ప్రతిపాదించినట్టు ప్రొఫెసర్ మంజునాథాచారి వివరించారు. ప్రతిపాదిత రూపకల్పనలో చిత్ర నాణ్యతను అభివృద్ధి చేయడానికి సమర్థవంతమైన ఎడ్జ్ క్యాప్చర్ టెక్నిక్, తక్కువ సంక్లిష్టతతో పదునైన ఫిల్టర్ ఉపయోగించినట్టు ఆయన తెలిపారు. గణన సంక్లిష్టతను, ప్రతిపాదిత రూపకల్పన హార్డ్ వేర్ ఖర్చులను తగ్గించడానికి వేద గణితం ఉపయోగించామని, రౌండింగ్ లోపం దిద్దుబాటు పద్ధతులను ఉపయోగించకుండా ఈ పద్ధతి అమలు చేస్తారన్నారు. రమాదేవి సమర్పించిన సిద్ధాంత వ్యాసం పీహెచ్డీ పట్టాకు ఆమె అర్హత సాధించింది.
ప్రమాదాల నివారణకు ఉపకరణ
నూతన సమీకృత మార్గాల ప్రణాళిక, ప్రధాన రహదారులపై రద్దీ నియంత్రణ అనే అంశంపై అధ్యయనం, విశ్లేషణ, దానిపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ విభాగం పరిశోధక విద్యార్థి పి.పార్థసారథిని డాక్టరేట్ వరించింది. ఈ సిద్ధాంతం సమీకృత విధానంలో రూపొందించారని, రహదారి భద్రతపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారని, రహదారి ప్రమాదాల నివారణకు ఇది ఉపకరిస్తుందని ఆయన తెలియజేశారు. ప్రయాణం ప్రారంభం నుంచి గమ్యస్థానం వరకు చిన్న మార్గాలను ఎంపిక చేసుకోవడంలో సహకరించడం... ఈ పరిశోధన ప్రధాన లక్ష్యమని, ఇది అవరోధాలను తొలగించడంతో ప్రమాదాల నివారణకు తోడ్పడుతుందన్నారు. అంతేకాక, వాహన చోదకుడు పరధ్యానం, అలసట, మగతలను గుర్తించడంతోపాటు డ్రైవర్ ఆరోగ్య పరిస్థితినికి కూడా పర్యవేక్షిస్తుందని... నష్టనివారణ హెచ్చరికలు జారీచేయడమే గాక, ప్రయాణీకుల భద్రతకు పెద్దపీట వేస్తుందని డాక్టర్ మంజునాథాచారి తెలిపారు. పార్థసారథి సమర్పించిన సిద్ధాంత వ్యాసం పీహెచ్డీ పట్టాకు అర్హత సాధించారు.
వారిద్దరూ డాక్టరేట్ సాధించడం వల్ల గీతం విశ్వవిద్యాలయం, హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్, గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మలు అభినందనలు తెలిపారు.
ఇదీ చూడండి: అ..ఆ..లు దిద్దకుండానే రెండులోకి...