ETV Bharat / state

అమ్మాలంటే.. 'ఆన్‌లైన్‌' గండం!

వర్షాభావం... చీడపీడలు... అధిగమించి... సాగు చేసిన కంది పంటను అమ్ముకునేందుకు అన్నదాతలకు ఆన్​లైన్​ కష్టాలు అడ్డుగా మారాయి. కొనుగోలు చేస్తారనే గంపెడాశతో కందులను తీసుకుని కేంద్రానికి వచ్చిన వారికి తీవ్ర నిరాశే మిగులుతోంది. పంటల సాగు సమయంలో వ్యవసాయ విస్తరణాధికారులు క్షేత్రస్థాయిలో సరైన సమాచారాన్ని తీసుకోకపోవడం, సేకరించిన వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయకపోవడమే ఇందుకు ప్రధాన కారణాలు. కందులు అమ్మాలంటే సతమవుతున్న రైతుల కష్టాలపై ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం...

Difficulties in buying crops in sangareddy district
అమ్మాలంటే.. 'ఆన్‌లైన్‌' గండం!
author img

By

Published : Feb 6, 2020, 5:53 PM IST

అమ్మాలంటే.. 'ఆన్‌లైన్‌' గండం!

సంగారెడ్డి జిల్లాలో ఈ సంవత్సరం రబీలో సాగైన 2800 టన్నుల మేర కందులు కొనుగోలు చేయాలని మార్క్​ఫెడ్​ అధికారులు నిర్ణయించారు. కేంద్రం అనుమతి మేరకు జిల్లాలోని జహీరాబాద్​, నారాయణఖేడ్​, రాయికోడ్​ వ్యవసాయ మార్కెట్​ యార్డులో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. జహీరాబాద్​లో జనవరి 27న కందుల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే మాణిక్​రావు ప్రారంభించారు. ఈనెల 3 వరకు 3207 క్వింటాళ్లు కొనుగోలు చేశారు.

రైతుల ఆందోళన

రాయికోడ్​ కొనుగోలు కేంద్రంలో ఇప్పటివరకు 2100 క్వింటాలు కొనుగోలు చేశారు. నారాయణఖేడ్​లో మాత్రం ఆన్​లైన్​ వివరాలు... రైతులు తెచ్చే పంటకు పొంతన లేకపోవడం వల్ల కొనుగోలు ఇంకా ప్రారంభం కాలేదు. జహీరాబాద్​ కొనుగోలు కేంద్రానికి కందులు తీసుకొస్తున్న రైతులకు మాత్రం ఆన్​లైన్​లో వివరాలు లేవని 10, 12 రోజులుగా కొనుగోలు కేంద్రం నిర్వాహకులు తిప్పుకుటున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వివరాలు​ నమోదు కాకపోవడం వల్లే

పొలంలో పండిన కంది నమూనాలు తీసుకుని కొనుగోలు కేంద్రాలకు వస్తున్న రైతులకు నిత్యం పడిగాపులు తప్పడం లేదు. టోకెన్ల జారీలోనూ... కేంద్రాల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పంటసాగు సమయంలో రైతుల నుంచి వివరాలు సేకరించి వ్యవసాయ శాఖ సిబ్బంది అంతర్జాలంలో సరైన వివరాలు నమోదు చేయకపోవడం వల్లే.. ఈ సమస్యలు తలెత్తున్నాయని రైతులు వాపోతున్నారు.

ధ్రువీకరణ అంశమై స్పష్టత ఇస్తే..!

రైతు సమాచారం ఆన్‌లైన్‌లో లేకుంటే స్థానిక మండల వ్యవసాయాధికారి, వీఆర్వో ధ్రువీకరణతో కందులను కొనే అంశమై స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటికే ఇదే అంశాన్ని మార్క్‌ఫెడ్‌ అధికారులు వ్యవసాయ శాఖ దృష్టికి తీసుకెళ్లారు. ఒకవేళ స్థానిక అధికారులు ఇచ్చే ధ్రువీకరణ పత్రాల సాయంతో కొనుగోళ్లు చేసినా బిల్లులు వస్తాయో, రావోనన్న సందేహం అధికారులను పట్టిపీడిస్తోంది. ఆన్‌లైన్‌ సమస్యపై మార్క్‌ఫెడ్‌ జిల్లా మేనేజరు రంజిత్‌రెడ్డిని వివరణ కోరగా... రైతులకు ఇబ్బంది లేకుండా చూసేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

ప్రత్యేక దృష్టి సారించాం

మే, జూన్‌లో పంటల సమాచారం తీసుకోవడం వల్ల కంది సాగు చేసిన కొందరి పేర్లు ఆన్‌లైన్‌లో నమోదు కాలేదని జిల్లా వ్యవసాయాధికారి నర్సింహారావు అన్నారు. ఈ అంశంపై ప్రత్యేక దృష్టిసారించామన్నారు. అర్హులైన రైతులు కందులను కొనుగోలు కేంద్రంలో అమ్ముకునేలా చూస్తామన్నారు.

పంట సాగు చేసినా ఆన్‌లైన్‌లో రైతుల వివరాలు నమోదు కాకపోవడమే ప్రధాన సమస్య. మండల వ్యవసాయాధికారి, వీఆర్వోలు ఇచ్చిన ధ్రువీకరణ పత్రాల సాయంతో కొనుగోలుకు అనుమతి ఇస్తే కంది పంటను సాగు చేసినవారికి ప్రయోజనం దక్కుతుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.