ETV Bharat / state

ఇవాళ జిల్లాల్లో డయాగ్నస్టిక్ హబ్‌లు ప్రారంభం: మంత్రి ఈటల - minister eetala latest news

జబ్బులు నయం చేసుకోవడానికి చేసే ఖర్చుల కంటే.. వాటి నిర్ధరణ పరీక్షలకే అధిక మొత్తంలో ఖర్చు చేయాల్సిన పరిస్థితి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యసేవలు మెరుగైనప్పటికీ.. వ్యాధి నిర్ధరణ పరీక్షలు చేయించుకోవాలంటే పేదవాడి జేబుకు చిల్లులు పడాల్సిందే. ఈ సమస్యను గుర్తించిన ప్రభుత్వం.. ప్రతి జిల్లా కేంద్ర ఆస్పత్రుల్లో డయాగ్నోస్టిక్ హబ్‌లను ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టింది.

Diagnostic hubs opening
Diagnostic hubs opening
author img

By

Published : Apr 30, 2021, 4:16 AM IST

Updated : Apr 30, 2021, 6:29 AM IST

ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన సేవలు అందించడంపై దృష్టి సారించిన ప్రభుత్వం.. గత కొన్ని సంవత్సరాలుగా మౌళిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించింది. పేద, దిగువ మధ్య తరగతి వారికి అన్ని రకాల నిర్థారణ పరీక్షలు సైతం ఉచితంగా అందించేందుకు తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్ పేరుతో వినూత్న ప్రయత్నం మొదలుపెట్టింది. దీనిలో భాగంగా 19 జిల్లాల్లో డయాగ్నస్టిక్ హబ్‌లు సిద్ధం చేశారు. వీటిలో కొన్ని ఇవాళ ప్రారంభిస్తున్నట్లు మంత్రి ఈటల ప్రకటించారు. మరో 2, 3 రోజుల్లో మిగతా సెంటర్లు ప్రారంభిస్తున్నట్టు తెలిపారు.

ఈ పథకంలో భాగంగా ప్రతి జిల్లాలో కేంద్ర ఆస్పత్రిలో డయాగ్నోస్టిక్ హబ్‌ను ఏర్పాటు చేశారు. సాధారణ పరీక్షల నుంచి థైరాయిడ్ సహా 57 రకాల పరీక్షలు చేయనున్నారు. 24 గంటల్లో ఫలితాలు సంబంధిత ఆస్పత్రికి ఆన్‌లైన్‌లో చేరవేస్తారు. పరీక్ష రిపోర్ట్‌ను రోగి సెల్ ఫోన్‌కు ఎస్​ఎంఎస్​ ద్వారా పంపిస్తారు.

ఇదీ చూడండి: 'కరోనా బాధితులను రెండు గంటలకోసారి పర్యవేక్షించాలి'

Last Updated : Apr 30, 2021, 6:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.