సంగారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో నిన్న అర్ధరాత్రి గర్భిణీ మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతురాలు జహీరాబాద్ మండలం హుగ్గెల్లి గ్రామానికి చెందిన స్వప్నగా గుర్తించారు. తీవ్ర అస్వస్థత కారణంగా ఆసుపత్రికి వచ్చిన ఆమెకు సరైన చికిత్స అందకపోవడంతోనే మృతి చెందినట్లు కుటుంబసభ్యులు ఆరోపించారు. అర్ధరాత్రి కావడం, బంధువులు ఆందోళన చేస్తారనే కారణంతో ఆసుపత్రి సిబ్బంది రాత్రికి రాత్రే మృతదేహాన్ని ఇంటికి పంపించారు. జిల్లా కేంద్ర ఆసుపత్రిలో స్వప్న ఎలాంటి పరీక్షలు చేయించుకోలేదని... తీవ్ర అస్వస్థతతో 12 గంటల 30నిమిషాలకు చేరారని.. అప్పటికే ఆమె కొనఊపిరితో ఉన్నట్లు జిల్లా ఆసుపత్రి పర్యవేక్షకులు తెలిపారు. వైద్యులు బతికించేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయిందన్నారు.
ఇదీ చూడండి: వాసవి, శ్రీనిధి ఇంజినీరింగ్ కళాశాలలకు సుప్రీం షాక్