లాక్డౌన్ అమలుతో సంచార జాతుల జీవనం దుర్భరంగా మారింది. ఉపాధి కల్పించే ఉత్పత్తులకు గిరాకీ లేక కాలి నడకనే సొంత గ్రామాలకు పయనమయ్యారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ 65వ నంబరు జాతీయ రహదారి మీదుగా సంచార జాతులకు చెందిన సుమారు వంద మంది గుల్బర్గా నుంచి హైదరాబాద్ వైపు కాలినడకన బయలుదేరి వెళుతున్నారు.
వీరిలో అత్యధికంగా పదేళ్ల లోపు చిన్నారులు ఉన్నారు. కాళ్లకు బొబ్బలెక్కినప్పటికీ... తల్లిదండ్రులతో నడక సాగిస్తూనే ఉన్నారు. వీరంతా రుద్రాక్ష, జపమాలలు తయారు చేసి అమ్ముకుంటూ జీవనం సాగిస్తారు. పక్షం రోజులుగా తినేందుకు తిండి, చేతిలో చిల్లిగవ్వ లేకపోవడం వల్లే జాతీయ రహదారిపై హైదరాబాద్ వైపు వెళుతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి : రెండు రోజులుగా కఠినంగా లాక్డౌన్ అమలు