ETV Bharat / state

గూగుల్​ పేతో ఖాతా ఖాళీ..అడ్డంగా దొరికిన కేడీ.. - సైబర్​ మోసం

ఒకే గ్రామానికి చెందిన వాడని నమ్మితే మోసం చేశాడు. మగతోడులేని ఆ మహిళను మాయమాటలతో ఏమార్చాడు. గూగుల్​పే సహాయంతో మూడో కంటికి తెలియకుండా డబ్బు కొల్లగొట్టాడు. కానీ సీన్​ రివర్స్​ అయ్యి ఊచలు లెక్కిస్తున్నాడు.

cyber-crime-in-sangareddy
గూగుల్​ పేతో ఖాతా ఖాళీ..అడ్డంగా దొరికిన కేడీ..
author img

By

Published : Dec 5, 2019, 5:31 PM IST

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని నాగూర్ గ్రామానికి చెందిన శాంతమ్మకు కంగ్టిలోని ఏపీజీవీబీ బ్యాంకులో ఖాతా ఉంది. భర్త చనిపోగా వచ్చిన రూ.5 లక్షల బీమా డబ్బులు, కూతురు వివాహానికి వచ్చిన కళ్యాణలక్ష్మి చెక్కును బ్యాంకు ఖాతాలో జమ చేసింది.
ఇదిలా ఉండగా అదే గ్రామానికి చెందిన తుకారం ఆమెకు మాయమాటలు చెప్పి ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ పుస్తకం నకలు ప్రతులను తీసుకున్నాడు. వాటి ద్వారా ఆమె ఖాతాలో ఉన్న డబ్బులను కాజేయాలని పథకం పన్నాడు.

గూగుల్​ పేతోనే స్వాహా చేశాడు..
అదే ఊరికి చెందిన రాజు ఇటీవల చరవాణిని పోగొట్టుకోవడం.. అది తుకారాంకు దొరికడం వల్ల అతను చేయాలనుకున్న పని మరింత సులువైంది. చరవాణిలోని సిమ్​ను వేరొక సెల్​లో వేసి గూగుల్​ పే డౌన్​లో చేసుకున్నాడు.
మరో మహిళను శాంతమ్మ అంటూ బ్యాంకు అధికారులకు చూపించాడు. బ్యాంకు అకౌంటుకు కొత్త ఫోన్ నెంబర్​ లింక్​ చేయాలని అధికారులను కోరాడు. దీనితో ఆమె ఖాతాలోని డబ్బులు రెండు నెలల్లో రూ. 2 లక్షల 50 వేల రూపాయలు ఖాళీ చేశాడు.

కథ అడ్డం తిరిగింది
ఇంతలో శాంతమ్మకు డబ్బులు అవసరం ఉండటం వల్ల బ్యాంకుకు వెళ్లి పరిశీలించగా రూ. 2 లక్షల 50 వేలు డ్రా చేశారని బ్యాంకు అధికారులు చెప్పడంతో ఆమె విస్తుపోయింది. దీనితో శాంతమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపగా తుకారం నేరానికి పాల్పడినట్లు రుజువైంది.

నిందితుడిని అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి రూ. 2 లక్షల 50 వేలు స్వాధీనం చేసుకుని రిమాండ్​కు పంపామని సీఐ వెంకటేశ్వరరావు తెలిపారు.

గూగుల్​ పేతో ఖాతా ఖాళీ..అడ్డంగా దొరికిన కేడీ..

ఇదీ చూడండి: ఈ ఏడాది ఎన్ని సైబర్​ కేసులు నమోదయ్యాయంటే..!?

Intro:Tg_srd_36_05_cyber_crime_ts10055Body:Tg_srd_36_05_cyber_crime_ts10055Conclusion:Tg_srd_36_05_cyber_crime_ts10055
Ravinder
9440880861
ఒక మహిళ బ్యాంక్ ఖాతా నుంచి ఆమెకు తెలియకుండా చాక చక్యంగా గూగుల్ పే సహాయం తో డబ్బులను కాజేసిన వ్యక్తి పోలీసులకు చిక్కాడు. సంగారెడ్డి జిల్లా కంగ్టి పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం. సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని నాగూర్ గ్రామానికి చెందిన శాంతమ్మ కంగ్టిలోని ఏపీజీవీబీ బ్యాంకులో ఖాతా కలిగి ఉంది. తొమ్మిది నెలల క్రితం ఆమె భర్త చనిపోగా రూ.5లక్షల బీమా డబ్బుల చెక్కు అందింది. ఈ డబ్బులు ఆమె బాంక్ ఖాతాలో దాచింది. అదే విధంగా ఆమె కూతురు వివాహం సంబంధించి కళ్యాణ లక్ష్మీ ద్వారా రూ. 75000 చెక్కు ను సైతం బ్యాంకు ఖాతాలో జమ చేసింది. ఆమెకు వచ్చిన డబ్బులను ఖాతాలోనే జమ చేసి ఉంచింది. ఇలా ఉండగా గ్రామానికి చెందిన తుకారం అనే వ్యక్తి ఆమెకు మాయమాటలు చెప్పి ఆమె వద్ద నుంచి ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ పుస్తకం నకలు ప్రతులను తీసుకున్నాడు. వాటి ద్వారా ఆమె ఖాతాలో ఉన్న డబ్బులను కాజేయాలని పథకం పన్నాడు. గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తి ఇటీవల చారవని పోగొట్టుకోవడం అది తుకారాంకు దొరికింది. అందులో ఉన్న సిమ్ కార్డు రీఛార్జి చేయించి దానిని వేరొక మొబైల్ లో వేసి ఆక్టివేట్ చేయించాడు. తనకు లభించిన సింకార్డు ను శాంతమ్మ ఖాతాకు లింక్ చేయాలని బాంక్లో దరఖాస్తు చేశాడు. దరఖాస్తుదారు స్థానంలో మరో మహిళను బ్యాంకులో పరిచయం చేయించాడు. అనంతరం ఆమెకు సంబంధించిన ఏటీఎం కార్డు సైతం ఎలాగో తస్కరించాడు. అనంతరం ఏటీఎం కార్డు ద్వారా తన మొబైల్ లో గూగుల్ పే యాప్ ను యాక్టివేట్ చేసుకొని డబ్బులను దశలవారీగా వాడుకోవడం ప్రారంభించారు. రెండు నెలల వ్యవధిలో దాదాపు రెండు లక్షల 50 వేలు డ్రా చేశాడు. ఇటీవల శాంతమ్మ కు డబ్బులు అవసరం ఉండటంతో బ్యాంకుకు వెళ్లి పరిశీలించగా 250000 డ్రా చేశారు కదా అని బ్యాంకు అధికారులు చెప్పడంతో ఆమె విస్తుపోయింది. దీంతో చేసేది లేక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరపగా తుకారం నేరానికి పాల్పడ్డట్లు రుజువు అయింది. నిందితుడిని అరెస్ట్ చేసి అతను డబ్బులు 2 లక్షల 50 వేలు స్వాధీనం చేసుకుని గురువారం రిమాండ్కు పంపారు అని సిఐ వెంకటేశ్వరరావు తెలిపారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.