ETV Bharat / state

Cyber Cheatings in Patancheru : సైబర్​ నేరగాళ్ల నయా రూట్​.. ఫుడ్​ ఆర్డర్​ క్యాన్సిల్​ చేసినందుకు ఖాతా ఖాళీ - Telangana latest news

Cyber Cheatings in Patancheru : మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా సైబర్ నేరస్థులు.. వినూత్న పద్ధతుల్లో అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లా.. పటాన్​చెరులో పార్ట్​ టైం జాబ్స్ పేరుతో​, ఫుడ్​ ఆర్డర్​ క్యాన్సిల్​ చేసినందుకు ఇలా.. వేరువేరు ఘటనల్లో 38.58 లక్షలు కొల్లగొట్టారు.

Cyber Frauds in Telangana
Cyber Cheatings in Patancheru
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 7, 2023, 3:16 PM IST

Cyber Frauds in Telangana : "డబ్బులు ఊరికే రావు" ఈ డైలాగ్.. ఓ ప్రముఖ జ్యవెల్లరీ ప్రకటన. మోసపూరిత వస్తువులు, వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలనే ఉద్దేశంలో ఈ డైలాగ్ చెబుతాడు ఆ జ్యువెల్లర్స్ ఓనర్. అయితే ఈ విషయాన్ని కేవలం జ్యువెల్లరీ కొనేటప్పుడు మాత్రమే కాదు.. మనం ఆన్​లైన్​లో వచ్చిన ప్రతి మెసేజ్, లింక్ విషయంలో పాటించాలి. కొన్ని అపరిచిత ఫోన్​ నెంబర్ల నుంచి డబ్బులు ఇస్తామంటూ సందేశాలు పంపిస్తారు. మీరు ఒక లక్కీ డ్రాకి ఎంపికయ్యారు. మీకు పెద్ద మొత్తంలో నగదు జమచేస్తాం అంటూ ఊరిస్తారు. వాటికి ఆశపడి లింక్​పై క్లిక్​ చేశామా ఇక అంతే సంగతులు. తాజాగా పటాన్​చెరు నియోజకవర్గ పరిధిలో అయిదు వేరు వేరు ఘటనల్లో.. సైబర్ మాయగాళ్లు 38.58 లక్షల రూపాయలను దోచేశారు.

Cyber Gang Arrest in Hyderabad : రూ.712 కోట్ల మోసం.. సైబర్ ముఠా అరెస్ట్.. డబ్బంతా తీవ్రవాదులకు చేరిందా..?

Cyber Crimes in Telangana : పటాన్​చెరు మండలం కర్దనూరు గ్రామానికి చెందిన ఓ రైతు.. తన వ్యవసాయ పొలంలో పనిచేసేందుకు వచ్చిన కూలీలకు ఆన్​లైన్​లో ఫుడ్ ఆర్డర్ చేశాడు. ఆర్డర్ తీసుకొని పొలం వరకు తీసుకురాలేమని చెప్పడంతో క్యాన్సిల్ చేశాడు. అయితే ఫుడ్ ఆర్డర్ కోసం చెల్లించిన నగదు వెనక్కి రప్పించుకునేందుకు.. గూగుల్లో టోల్ ఫ్రీ నెంబర్ సాయంతో ప్రయత్నించాడు. దీంతో రైతు ఖాతాలో ఉన్న 1.9 లక్షల రూపాయలు దోచేశారు సైబర్ కేటుగాళ్లు. రైతు తాను మోసపోయినట్టు గుర్తించి బీడీఎల్ భానూర్ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు.

మరో కేసులో.. సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు పోలీస్​స్టేషన్ పరిధిలో ఓ సాఫ్ట్​వేర్​ ఉద్యోగికి.. పార్ట్​టైం జాబ్స్​ పేరుతో వాట్సాప్ ద్వారా మెసేజ్​ వచ్చింది. చిన్న మొత్తంలో డబ్బు జమ చేసి టాస్క్​ పూర్తి చేస్తే.. అధిక లాభాలు వస్తాయని ఆశ చూపారు. మొదటగా అతను తొమ్మిది వేల రూపాయాలు జమ చేసి టాస్క్​ పూర్తి చేశాడు. దీంతో రెట్టింపు మొత్తంలో డబ్బులు వచ్చాయి. ఇదంతా నిజమేనని గ్రహించిన సదరు వ్యక్తి పలు దఫాలుగా 30 లక్షల రూపాయాలు జమ చేసి టాస్క్​లు పూర్తి చేశాడు.

Cyber Cheatings in Sangareddy : టాస్క్​ల అనంతరం తనకు వచ్చిన లాభాలు, పెట్టుబడిని తిరిగివ్వాలంటూ కోరాడు. అటువైపు నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో.. తాను సైబర్​ నేరస్థుల చేతిలో మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అమీన్​పూర్​ పోలీస్​స్టేషన్​ పరిధిలోని మరో వ్యక్తి కూడా ఇదే తరహా మోసానికి బలయ్యాడు.

బీరంగూడ సాయిభగవాన్​ కాలనీకి చెందిన ఓ వ్యక్తికి.. తన క్రెడిట్​ కార్డుకు రివార్డ్సు వచ్చాయంటూ వాడుకోవాలని ఫోన్​లో లింక్​ పంపించారు. నిజమేనని అనుకున్న వ్యక్తి లింక్​ క్లిక్​ చేయడంతో 84 వేల రూపాయాలను దోచేశారు. వందనపురి కాలనీకి చెందిన ఓ ప్రెవేట్​ ఉద్యోగిని.. తన ఇంట్లో వైఫై పనిచేయక పోవడంతో పునరుద్ధరణ కోసం నెట్​లో వెతికింది. అపరిచిత వ్యక్తికి కాల్​చేసి.. అతను చెప్పినట్లుగా చేయడంతో 95వేల రూపాయలు పోగోట్టుకుంది. అనంతరం అమీన్​పూర్​ పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేసింది.

Cyber Crime Gangs Arrest : హలో.. అంటూ అందినకాడికి దోచేస్తున్న ముఠాలు అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.