ETV Bharat / state

ఎమ్మెల్యే స్వగ్రామంలో కరోనా బాధితులకు వైకుంఠధామమే ఐసోలేషన్ సెంటర్

సంగారెడ్డి జిల్లా ఖానాపుర్​లో కరోనా బాధితులకు కష్టాలు తప్పడం లేదు. వారికి గ్రామంలో ప్రవేశం లేకపోవడం వల్ల వైకుంఠధామంలోనే ఐసోలేషన్​లో ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ​

author img

By

Published : Jul 30, 2020, 7:32 PM IST

covid patients  problems in sangareddy district
'ఆ జిల్లాలో కరోనా బాధితులకు వైకుంఠధామంలోనే ఐసోలేషన్​'

సంగారెడ్డి జిల్లా ఖానాపుర్​లో కరోనా సోకిన బాధితులకు అవస్థలు తప్పడం లేదు. వారికి గ్రామంలో ఐసోలేషన్​లో ఉండేందుకు స్థలం లేకపోవడం వల్ల ఇటీవల నిర్మించిన వైకుంఠధామంలో ఉంటున్నారు.

స్థానికంగా కరోనా సోకిన ముగ్గుర బాధితులకు ప్రభుత్వ పరంగా ఇసోలేషన్ చేసే సదుపాయం లేదు. నియోజకవర్గ పరిధిలో కేసులు పెరుగుతున్న తరుణంలో ప్రభుత్వం ఆ వ్యక్తులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఇదిలా ఉంటె బాధితులు వైకుంఠ ధామంలో ఉండటం పరిసర తండా వాసులు వ్యతిరేకిస్తున్నారు. అయితే మానవత్వానికి మచ్చ తెచ్చే ఈ చర్యలు అందరిని కంట తడి పెట్టిస్తున్నాయి.

covid patients  problems in sangareddy district
కరోనా బాధితులకు వైకుంఠధామంలోనే ఐసోలేషన్​

వారికి గ్రామంలో ప్రవేశం లేకపోవడం, ప్రభుత్వ పరంగా వసతులు లేకపోవడంతో అక్కడ ఉంటున్నారు. అక్కడ వారికి ఎలాంటి పీపీఈ కిట్లు కూడా అందుబాటులో లేవు. ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి సోకిన బాధితులను ప్రభుత్వం పాటించుకోకుండా వదిలేసింది. అంతే కాదు ఈ గ్రామం నారాయణ ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి స్వగ్రామం కావడం కూడా మరో విశేషం.

ఇదీ చూడండి: అయోధ్య శోభాయమానం- భూమిపూజకు ముస్తాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.