సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ నియోజకవర్గ పరిధిలో కరోనా చాప కింద నీరులా వ్యాపిస్తోంది. ఆరంభంలో ఒక్క కేసు లేని ఈ ప్రాంతంలో ప్రస్తుతం 12 కేసులు వెలుగు చూశాయి. గ్రామీణ ప్రాంతాలకూ కరోనా వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. నియోజకవర్గ కేంద్రంలో ఒక కేసు నమోదైంది. సిర్గాపూర్ మండలంలోని నల్లవాగులో ఒకరికి వ్యాధి సోకగా, ఆయన కుటుంబంలోని ముగ్గురితో పాటు అదే గ్రామానికి చెందిన మరో మహిళకు పాజిటివ్ నిర్ధారణ అయింది.
నాగల్గిద్ద మండలంలోని ఔదాతపూర్లో వారం క్రితం రెండు కేసులు వెలుగు చూశాయి. అదే గ్రామంలో ఇటీవల మరో కేసు బయటపడింది. కంగ్టి మండలంలోని తడ్కల్లో రెండు కేసులు నమోదు అయ్యాయి. కల్హేర్లో ఓప్రభుత్వ ఉద్యోగికి కరోనా సోకింది.
ఇదీ చదవండి: కూల్చివేత ఎఫెక్ట్: ఆలయం, మసీదు దెబ్బతినటంపై సీఎం విచారం