సంగారెడ్డి జిల్లాలో రైతు వేదికల నిర్మాణాన్ని ఈనెల 25లోపు పూర్తి చేయాలని పాలనాధికారి హనుమంతరావు అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం హుగ్గెల్లి, రాంజోల్, హోతి (బి) గ్రామాల్లో పర్యటించి నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
గడువులోగా నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశించినట్లు వెల్లడించారు. నాణ్యతలో గుత్తేదారులు రాజీపడొద్దని ఆయన సూచించారు. పూర్తి స్థాయిలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇవీ చూడండి ; 'పోతిరెడ్డుపాడుపై అప్పుడే ఎందుకు ప్రశ్నించలేదు'