భారత్-చైనా సరిహద్దు వద్ద డ్రాగన్ బలగాల దుశ్చర్యకు నిరసనగా సంగారెడ్డి జిల్లా పటాన్చెరు జాతీయ రహదారిపై కాంగ్రెస్ నాయకులు ఆందోళన నిర్వహించారు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. కేంద్ర ప్రభుత్వ అసమర్థత వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి ఆరోపించారు.
ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోవడం లేదని ఎద్దేవా చేశారు. ఏది ఏమైనా భారత సైనికుల పోరాటానికి అండగా నిలుస్తామని తెలిపారు. వీర మరణం పొందిన సైనికులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.