ETV Bharat / state

మున్సిపల్ ఎన్నికల్లో 50శాతం సీట్లు బీసీలకే: ఉత్తమ్ - ఉత్తమ్

కొత్తపురపాలక చట్టం ప్రకారం ఎన్నుకున్న ప్రజాప్రతినిధులను తొలగించే అధికారం కలెక్టర్లకు కట్టబెట్టడాన్ని కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రజానీకం ఈ నిర్ణయాన్ని హర్షించడంలేదని విమర్శించారు. సంగారెడ్డి శివారు కొండాపూర్‌లో నిర్వహించిన పురపాలక ఎన్నికల సన్నాహక సమావేశంలో పేర్కొన్నారు.

మున్సిపల్ ఎన్నికల్లో 50శాతం సీట్లు బీసీలకే: ఉత్తమ్
author img

By

Published : Jul 21, 2019, 9:37 PM IST

కేసీఆర్ నియంతృత్వ ధోరణికి కొత్త పురపాలక చట్టమే నిదర్శనమని టీపీసీసీ అధ్యక్షుడు, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. వచ్చే పురపాలక ఎన్నికల్లో తమ పార్టీ తరఫున బీసీలకు 50శాతం సీట్లు కేటాయిస్తామని ఆయన హమీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి మున్సిపాలిటీ ఎన్నికల సన్నాహక సమీక్షను సంగారెడ్డిలో నిర్వహించారు. కేసీఆర్ తీసుకువచ్చిన కొత్త పురపాలక చట్టం రాజ్యాంగ స్ఫూర్తిని నీరుగార్చే విధంగా ఉందని ఆ పార్టీ శాసన సభ పక్ష నేత భట్టి విక్రమార్క విమర్శించారు. ఈ చట్టం ద్వారా స్థానిక సంస్థల్లో గెలిచిన ప్రజా ప్రతినిధులను కలెక్టర్ల చేతిలో కీలుబొమ్మలుగా మార్చుతున్నారని ఉత్తమ్​ ఆరోపించారు. రోబోయే మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంటుందని ఉత్తమ్​ ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 27నుంచి 30తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్నీ పట్టణాల్లో కాంగ్రెస్ జెండా పండుగ నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

మున్సిపల్ ఎన్నికల్లో 50శాతం సీట్లు బీసీలకే: ఉత్తమ్

ఇవీచూడండి: రమణీయంగా మారిన తెలంగాణ నయాగరా

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.